బన్నీతో సినిమా చేయను గాక చేయను
అల్లు అర్జున్ తో సినిమా అంటే ఏ దర్శకుడైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు.. ఇక మహేష్ తో మూవీ అంటే ఎగిరి గంతేస్తాడు.. అవసరమైతే మహేష్ మూవీ కోసం ఓ రెండేళ్లు వెయిట్ చేయడానికైనా సిద్ధమే. అటు నాగార్జునతో సినిమా అంటే సెట్స్ పైకి వెళ్లిపోవడమే ఆలస్యం. కానీ ఓ దర్శకుడు మాత్రం సినిమాలు చేయనంటున్నాడు. తనకు అస్సలు టైం లేదంటున్నాడు. అతడే రవి.కె.చంద్రన్. సినిమాటోగ్రాఫర్ గానే కాకుండా డైరక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు […]
Advertisement
అల్లు అర్జున్ తో సినిమా అంటే ఏ దర్శకుడైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు.. ఇక మహేష్ తో మూవీ అంటే ఎగిరి గంతేస్తాడు.. అవసరమైతే మహేష్ మూవీ కోసం ఓ రెండేళ్లు వెయిట్ చేయడానికైనా సిద్ధమే. అటు నాగార్జునతో సినిమా అంటే సెట్స్ పైకి వెళ్లిపోవడమే ఆలస్యం. కానీ ఓ దర్శకుడు మాత్రం సినిమాలు చేయనంటున్నాడు. తనకు అస్సలు టైం లేదంటున్నాడు. అతడే రవి.కె.చంద్రన్. సినిమాటోగ్రాఫర్ గానే కాకుండా డైరక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు రవి.కె.చంద్రన్. అలాంటి దర్శకుడు బన్నీతోనే కాదు.. ఏ హీరోతో సినిమా చేయనని కరాఖండిగా చెప్పేశాడు. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ సినిమాటోగ్రాఫర్ వరుస యాడ్స్ తో బిజీగా ఉన్నాడు. మరో ఏడాది పాటు చేతిలో ఉన్న వాణిజ్య ప్రకటనలు తప్ప మరో ప్రాజెక్ట్ ఒప్పుకునే పరిస్థితి లేదని కుండబద్దలుకొట్టాడు. రీసెంట్ గా బన్నీతో ఓ యాడ్ షూట్ చేశాడు రవిచంద్రన్. ఆ టైమ్ లోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని పుకార్లొచ్చాయి. ఆ రూమర్లకు ఇలా సమాధానం చెప్పాడు రవి.కె.చంద్రన్.
Advertisement