తండ్రి-కూతురు చిందులు

ఇక్కడ తండ్రి కమల్ హాసన్.. కూతురు శృతిహాసన్. ఈ ఇద్దరి దారులు వేరు. ఒకరేమో విలక్షణ సినిమాలతో బిజీ. మరొకరేమో మాస్ మసాలా సినిమాలతో నిత్యం బిజీ. మరి అలాంటి తండ్రికూతుళ్లు కలిసి సిినిమా చేసే అవకాశం ఉందా.. సుదూరంలో అలాంటి ఛాయలేవీ కనిపించడం లేదు. నిజజీవితంలో తండ్రికూతురు కాబట్టి కథ కూడా బాగా సెట్ అవ్వాలి. కానీ ఈ గ్యాప్ లోనే ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఒకే వేదికపైకి వచ్చారు. కలిసి డాన్స్ కూడా చేశారు. […]

Advertisement
Update:2015-04-28 03:43 IST
ఇక్కడ తండ్రి కమల్ హాసన్.. కూతురు శృతిహాసన్. ఈ ఇద్దరి దారులు వేరు. ఒకరేమో విలక్షణ సినిమాలతో బిజీ. మరొకరేమో మాస్ మసాలా సినిమాలతో నిత్యం బిజీ. మరి అలాంటి తండ్రికూతుళ్లు కలిసి సిినిమా చేసే అవకాశం ఉందా.. సుదూరంలో అలాంటి ఛాయలేవీ కనిపించడం లేదు. నిజజీవితంలో తండ్రికూతురు కాబట్టి కథ కూడా బాగా సెట్ అవ్వాలి. కానీ ఈ గ్యాప్ లోనే ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఒకే వేదికపైకి వచ్చారు. కలిసి డాన్స్ కూడా చేశారు. అలాంటి అరుదైన, అద్భుతమైన ఘట్టానికి చెన్నై లోని ఓ అవార్డు ఫంక్షన్ వేదికగా మారింది. తన కూతురు శృతిహాసన్ తో కలిసి కమల్ హాసన్ డాన్స్ చేశారు. మైఖేల్ మదన కామరాజులోని ఓ సూపర్ హిట్ సాంగ్ కు ఈ తండ్రికూతుళ్లిద్దరూ స్టెప్స్ వేశారు. ఈ విషయాన్ని శృతిహాసన్ కూడా కన్ ఫర్మ్ చేసింది. నాన్నతో కలిసి డాన్స్ చేయడం జీవితంలో మరిచిపోలేనంటూ ట్వీట్ చేసింది.
Tags:    
Advertisement

Similar News