రామ్ చరణ్ సినిమా వాయిదా పడింది
అవును.. సెట్స్ పైకి వెళ్లకముందే చెర్రీ సినిమా పోస్ట్ పోన్ అయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో మై నేమ్ ఈజ్ రాజు పేరుతో ఓ సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నాడు చరణ్. ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలన్నీ పూర్తయ్యాయి. క్యారెక్టర్ కు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ లో మార్పులు కూడా చేసుకున్నాడు చరణ్. బ్యాంకాక్ వెళ్లి భారీ ఫైట్స్ కూడా నేర్చుకొని తిరిగొచ్చాడు. అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ చెర్రీ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈరోజు (ఏప్రిల్ 28) నుంచి […]
Advertisement
అవును.. సెట్స్ పైకి వెళ్లకముందే చెర్రీ సినిమా పోస్ట్ పోన్ అయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో మై నేమ్ ఈజ్ రాజు పేరుతో ఓ సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నాడు చరణ్. ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలన్నీ పూర్తయ్యాయి. క్యారెక్టర్ కు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ లో మార్పులు కూడా చేసుకున్నాడు చరణ్. బ్యాంకాక్ వెళ్లి భారీ ఫైట్స్ కూడా నేర్చుకొని తిరిగొచ్చాడు. అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ చెర్రీ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈరోజు (ఏప్రిల్ 28) నుంచి సెట్స్ పైకి వెళ్తుందనుకున్న ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది. ఇంత అర్థాంతరంగా చెర్రీ సినిమా ఎందుకు వాయిదా పడిందో ఎవరికీ అర్థం కావట్లేదు. శ్రీనువైట్ల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. తీన్ మార్ తో మెరిసిన కృతి కర్బందా, రామ్ చరణ్ కు చెల్లెలు లేదా అక్క పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీత దర్శకుడిగా ఇప్పటికే ఫిక్సయ్యాడు. సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయాలని అనుకున్నారు. ఇలా అన్నీ ముందుగానే నిర్ణయించుకున్నప్పటికీ సెట్స్ పైకి వెళ్లడంలో మాత్రం ఫెయిలైంది మై నేజ్ ఈజ్ రాజు మూవీ. దీనికి కారణం దర్శకుడు శ్రీనువైట్లా.. లేక హీరో రామ్ చరణా అనేది తెలియాల్సి ఉంది.
Advertisement