భూకంప మృతులు 10 వేలు: నేపాల్ ప్రధాని అంచనా
భూకంపం వల్ల మరుభూమిగా మారిన నేపాల్‌లో ఇప్పటివరకు 4352 మంది మృతి చెందారు. ఈ విషయం నేపాల్ అధికారికంగా ప్రకటించింది. అయితే మృతులు 10 వేల వరకు ఉండవచ్చని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా అన్నారు. కాగా ఉదయం నుంచి ఒక మాదిరి జల్లులతో పడిన చినుకులు మధ్యాహ్నం అయ్యేసరికి భారీ వర్షంగా మారింది. దీంతో శిధిలాల నుంచి మృతదేహాలను బయటకి తీయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా శిధిలాలు తొలగిస్తూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా సహాయక […]
Advertisement
భూకంపం వల్ల మరుభూమిగా మారిన నేపాల్‌లో ఇప్పటివరకు 4352 మంది మృతి చెందారు. ఈ విషయం నేపాల్ అధికారికంగా ప్రకటించింది. అయితే మృతులు 10 వేల వరకు ఉండవచ్చని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా అన్నారు. కాగా ఉదయం నుంచి ఒక మాదిరి జల్లులతో పడిన చినుకులు మధ్యాహ్నం అయ్యేసరికి భారీ వర్షంగా మారింది. దీంతో శిధిలాల నుంచి మృతదేహాలను బయటకి తీయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా శిధిలాలు తొలగిస్తూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా సహాయక చర్యలు ఒక కొలిక్కి రావడం లేదు. గత మూడు రోజుల నుంచి కొందరు వ్యక్తులు సజీవంగా ఉన్నట్టు తెలిసినప్పటికీ వారిని వెలికి తీయడానికి సహాయక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. నేపాల్‌లో కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు ఆటకం కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. కాగా ఆపన్న హస్తం అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తుంది. భారత్‌తోపాటు అమెరికా, రష్యా, కెనడా, జపాన్, బ్రిటన్ వంటి దేశాలన్నీ నేపాల్‌ను తగిన విధంగా ఆదుకుంటామని చెబుతున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి నేపాల్‌కు సహాయక బృందాలు చేరుకుని తమ వంతు సాయం చేస్తున్నాయి. భారత్ నుంచి 11 విమానాలు సహాయక చర్యల్లో తోడ్పడుతున్నాయి. కొన్ని వస్త్రాలు, మందులు, ఆహారం వంటివి నేపాల్ బాధితులకు చేరుతున్నాయి. అయినా అయిన వారిని పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో బాధితులు తల్లడిల్లిపోతున్నారు.
Advertisement