ఈసారి షార్ట్ ఫిల్మ్స్ నుంచి కాపీ కొట్టాడు
సినీ కథకులు, దర్శకులు ఎక్కువమంది విదేశీ సినిమాలను చూసి ఆ ఇన్స్పిరేషన్‌తో కథలు రాసుకోవడమో, లేదా తెగించి కాపీ కొట్టడమో చేస్తుండేవారు. అయితే ఇటీవల అందరికి విదేశీ సినిమాలు అందుబాటులోకి రావడంతో సాధారణ వ్యక్తులు కూడా విదేశీ సినిమాలను చూడగలుగుతున్నారు. దీంతో ఎవరు ఏ సినిమానుంచి ఇన్స్పిరేషన్ పొందిందీ, ఏ సినిమాను కాపీ కొట్టిందీ ప్రేక్షకులు గుర్తించేస్తున్నారు . దాంతో విదేశీ సినిమాలను కాపీ కొట్టాలంటే ఒక కొత్త భయం ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు మూల కథలకోసం […]
సినీ కథకులు, దర్శకులు ఎక్కువమంది విదేశీ సినిమాలను చూసి ఆ ఇన్స్పిరేషన్‌తో కథలు రాసుకోవడమో, లేదా తెగించి కాపీ కొట్టడమో చేస్తుండేవారు. అయితే ఇటీవల అందరికి విదేశీ సినిమాలు అందుబాటులోకి రావడంతో సాధారణ వ్యక్తులు కూడా విదేశీ సినిమాలను చూడగలుగుతున్నారు. దీంతో ఎవరు ఏ సినిమానుంచి ఇన్స్పిరేషన్ పొందిందీ, ఏ సినిమాను కాపీ కొట్టిందీ ప్రేక్షకులు గుర్తించేస్తున్నారు . దాంతో విదేశీ సినిమాలను కాపీ కొట్టాలంటే ఒక కొత్త భయం ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు మూల కథలకోసం కొత్త దారులు వెతుకుతున్నారు.
అలా కొత్త దారులు వెతికే ఓ కొత్త దర్శకుడు ఇటీవల ఒక సినిమా విడుదల చేశాడు. దర్శకుని రెండో సినిమా ఇది. ఆ సినిమా కథకోసం రెండు షార్ట్ ఫిలిమ్స్‌ను వాడుకున్నాడు. ఒక హైదరాబాద్ జర్నలిస్ట్ తీసిన “వాచ్” అనే షార్ట్ ఫిలిమ్‌ను, విశాఖ అబ్బాయి తీసిన “నౌ దో గ్యారా” షార్ట్ ఫిలిమ్‌ను తెలివిగా తన సినిమాలో వాడుకున్నాడు. ఈ రెండు షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్‌లో కూడా ఉన్నాయి. ఈయన ఇన్స్పిరేషన్‌తో ఇక సినిమా కథలకోసం షార్ట్ ఫిలిమ్స్ మీద పడతారేమో చూడాలి!.