దోచేయ్ సినిమా రివ్యూ

దోచేయ్ సినిమా రివ్యూ: దోచేయ్ రేటింగ్: 2/5 ప్లస్ పాయింట్స్:నాగచైతన్య యాక్టింగ్, ఫొటోగ్రఫి ,కామెడీ సీన్లు మైనస్ పాయింట్స్ :స్టోరీ, స్క్రీన్ ప్లే, సెకండాఫ్ చందు (నాగచైతన్య) అందర్ని మోసగిస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. తండ్రి (రావు రమేశ్) జైలులో ఉండటంతో మెడికల్ కాలేజీలో చదువుతున్న చెల్లెల్లి బాధ్యత చందుపై పడుతుంది.

Advertisement
Update:2015-04-24 09:32 IST

దోచేయ్ సినిమా రివ్యూ

సినిమా రివ్యూ: దోచేయ్

రేటింగ్: 2/5

ప్లస్ పాయింట్స్: నాగచైతన్య యాక్టింగ్, ఫొటోగ్రఫి ,కామెడీ సీన్లు

మైనస్ పాయింట్స్: స్టోరీ, స్క్రీన్ ప్లే, సెకండాఫ్

చందు (నాగచైతన్య) అందర్ని మోసగిస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. తండ్రి (రావు రమేశ్) జైలులో ఉండటంతో మెడికల్ కాలేజీలో చదువుతున్న చెల్లెల్లి బాధ్యత చందుపై పడుతుంది. మెడికల్ కాలేజిలోనే చదువుతున్న మీరా( కృతిసనన్)ను తొలిచూపులోనే ఇష్టపడుతాడు. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేసి.. కొట్టేసిన మాణిక్యం (పోసాని)కు సంబంధించిన సొమ్ము చందుకు లభిస్తుంది. తండ్రిని జైలు నుంచి విడిపించడానికి హోంమంత్రి పీఏకు ఆ డబ్బును ముట్టజెపుతాడు. దాంతో చందు తండ్రిని, చెల్లెల్నిమాణిక్యం కిడ్నాప్ చేస్తాడు. డబ్బు విషయంపై ఆరా తీస్తూ లంచగొండి ఇన్ స్పెక్టర్ రిచర్డ్ (రవిబాబు)

చందును వెంటాడుతుంటాడు. మాణిక్యం కిడ్నాప్ చేసిన తల్లి, చెల్లెల్ని విడిపించుకోవడం కోసం తెలుగు తెర సూపర్ స్టార్ బుల్లెట్ బాబు (బ్రహ్మనందం) సహాయం తీసుకుంటాడు. చివరికి తల్లిని, చెల్లెల్ని ఎలా విడిపించుకున్నాడు ? తండ్రి జైలుకు పోవడానికి కారణమైన వ్యక్తి ఎవరు? అతనిపై ఎలా పగతీర్చుకున్నాడు ? సినీ హీరో బుల్లెట్ బాబు సహాయాన్ని ఎందుకు ఎలా తీసుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'దోచెయ్' చిత్రం.

గత చిత్రాలకంటే నాగచైతన్య అందంగా కనిపించాడు. ఫెర్ఫార్మెన్స్ పరంగానూ పరిణితిని ప్రదర్శించాడు. పైట్స్, డ్యాన్స్ లో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.కృతిసనన్ కు మంచి పాత్రే లభించినా.. మెరుగైన ఫెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించడంలో విఫలమైందనే చెప్పాలి. నాగచైతన్య, కృతిల మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పవచ్చు. బుల్లెట్ బాబుగా బ్రహ్మనందం, మాణిక్యంగా పోసాని, చైతూ

స్నేహితులుగా ప్రవీణ్, హర్ష, సప్తగిరిలు పర్వాలేదనిపించారు. రావురమేశ్ పాత్ర గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. రవిబాబు రొటిన్ పాత్రలోనే కనిపించాడు.

టెక్నికల్:

మంచి బీట్ తో సన్ని ఎంఆర్ అందించిన పాటలు చిత్రంలో సందర్భోచితంగా బాగానే ఉన్నాయి. సన్నివేశాలకు అనుగుణంగా సన్నీఅందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. పాటలను అందంగా చిత్రీకరించడంలో కెమెరామెన్ రిచర్డ్ ప్రసాద్ పనితీరు బాగుంది. యాక్షన్, చేజింగ్ సీన్ల చిత్రీకరణ ఆకట్టుకుంది. సీన్లను చకచకా పరిగెత్తిచడంలో ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ సఫలమయ్యారు.

దర్శకుడి ప్రతిభ:

స్వామిరారా చిత్రంలో చక్కటి స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో కూడా అదే శైలిని అనుసరించి చిత్రాన్నిరూపొందించాడు. ఫస్టాఫ్ లో తనదైన శైలిలో స్క్రీన్ ప్లేతో నడిపించిన దర్శకుడు సుధీర్ వర్మ.. కథలో బలం లేకపోవడంతో తడబాటుకు గురయ్యాడు. పూర్తిగా కథనంపైనే దృష్టిపెట్టి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. కామెడీ సీన్లను చక్కగా ప్లాన్ చేసినా.. బలమైన పాయింట్ లేకపోవడంతో

హాస్యం తేలిపోయింది. క్లైమాక్స్ లో బ్రహ్మనందంతో కొన్ని లోపాలను సరిదిద్దుకునేందుకు చేసినా ప్రయత్నం బెడిసికొట్టింది. పోసాని మార్క్ విలనిజం,రవిబాబు నెగెటివ్ షేడ్స్ ను పక్కాగా డిజైన్ చేయడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు.రావు రమేశ్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. హీరో, హీరోయిన్ల సీన్లుచప్పగా సాగాయి. ఓవరాల్ గా ప్రేక్షకులు భారీ స్థాయిలో పెట్టుకున్న అంచనాలను

చేరుకోవడంలో సుధీర్ వర్మ విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఎంతసేపు దోపిడిలు, చీటింగ్లతో ప్రేక్షకులను మభ్యపెట్టడం కష్టమేనని తెలుసుకోవాల్సిన సమయం "దోచేయ్" ద్వారా లభించింది. ఈ చిత్రంలో ఓ డైలాగ్ ఉంటుంది. అదేంటంటే 'చెప్పడంలో ఆస్కార్

చూపిస్తారు.. తీయడంలో నరకం చూపిస్తారు'. ఈ డైలాగ్ 'దో్చేయ్' వర్తిస్తుందనే విషయాన్ని దర్శకుడు తెలుసుకుంటాడో ఏం చూడాల్సిందే. పూర్తిగా యూత్ టార్గెట్ చేసి నిర్మించిన ఈ చిత్ర ఫలితం కాస్తా ఓపిక పడితే తెలియడం ఖాయం.

నటీనటులు: నాగచైతన్య, కృతిసనన్, రావు రమేశ్, పోసాని, రవిబాబు, బ్రహ్మనందం,సప్తగిరి, ప్రవీణ్, హర్ష

నిర్మాత: ప్రసాద్ బీవీఎస్ఎన్

సంగీతం: సన్నీ ఆర్ ఎం

దర్శకుడు: సుధీర్ వర్మ

Tags:    
Advertisement

Similar News