లేడీ ప్ర‌కాష్ రాజ్ ?

తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ , హిందీ – ఇలా ఏ భాషా ప‌రిశ్ర‌మ ని క‌దిపినా , ప్ర‌కాష్ రాజ్ గురించి ఒక‌టే మాట చెబుతారు. న‌ట‌న‌లో ఎంత ప్ర‌తిభావంతుడో , ప్ర‌వ‌ర్త‌న‌లో అంత ప్రాబ్లమాటిక్ అని. ఇప్పుడు అదే రేంజ్ పేరు తెచ్చుకుంది నిత్యా మీన‌న్ . హైట్ ప‌రంగా పొట్టిద‌యినా ఎక్స్ ప్రెష‌న్స్ తో మెప్పిస్తుంది. కాని ఆమె బిహేవియ‌ర్ త‌లుచుకుంటే ఆమెతో ప‌ని చేసిన వాళ్ళు చిరాకు ప‌డుతున్నారు. డ‌బ్బుల విష‌యంలో చాలా నిక్క‌చ్చిగా ఉంటుంది. పేమెంట్ అందుకున్నాకే షూటింగ్ కి […]

Advertisement
Update:2015-04-21 12:13 IST
లేడీ ప్ర‌కాష్ రాజ్ ?
  • whatsapp icon

తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ , హిందీ – ఇలా ఏ భాషా ప‌రిశ్ర‌మ ని క‌దిపినా , ప్ర‌కాష్ రాజ్ గురించి ఒక‌టే మాట చెబుతారు. న‌ట‌న‌లో ఎంత ప్ర‌తిభావంతుడో , ప్ర‌వ‌ర్త‌న‌లో అంత ప్రాబ్లమాటిక్ అని. ఇప్పుడు అదే రేంజ్ పేరు తెచ్చుకుంది నిత్యా మీన‌న్ . హైట్ ప‌రంగా పొట్టిద‌యినా ఎక్స్ ప్రెష‌న్స్ తో మెప్పిస్తుంది. కాని ఆమె బిహేవియ‌ర్ త‌లుచుకుంటే ఆమెతో ప‌ని చేసిన వాళ్ళు చిరాకు ప‌డుతున్నారు. డ‌బ్బుల విష‌యంలో చాలా నిక్క‌చ్చిగా ఉంటుంది. పేమెంట్ అందుకున్నాకే షూటింగ్ కి వ‌స్తుంది. అసిస్టెంట్ప్ కి బేటాలు ఇచ్చాకే కార‌వాన్ నుంచి దిగుతుంది. స్టార్ హోట‌ల్స్ , బిజినెస్ క్లాస్ టిక్కెట్టు అన్నీ మామూలే. అయితే షూటింగ్ లో, డ‌బ్బింగ్ లో త‌ల బిరుసుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. రీ టేక్ ల విష‌యంలో వాదిస్తుంటుంది, డైరెక్ట‌ర్ మాట విన‌దు. ఈ మ‌ధ్య స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి , ఓ.కే. బంగారం సినిమాల‌తో స‌క్సెస్ త‌ల‌కి ఎక్క‌డంతో అస‌లు ఎవ‌రి మాట వినడం లేదు. ఇలాగ‌యితే నిత్యా మీన‌న్ ని ఇండ‌స్ర్టీ భ‌రించ‌డం క‌ష్ట‌మంటున్నారు.

Tags:    
Advertisement

Similar News