ప్రియాంక చోప్రా బాజీరావు మొదటి భార్య ?
అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా రోల్స్ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. మరి గ్లామర్ డాల్ రోల్స్ చేయడానికి మక్కువ చూపదు. అలా ఒప్పుకుంటే ఓ బర్ఫి లాంటి చిత్రం వచ్చేది కాదు. తాజాగా సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో బాజీరావు మస్తానీ చిత్రంలో ఒక కీ రోల్ చేస్తుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా 85 చీరలు కడుతుందట. కథ పరంగా బాజీరావు మస్తానీ మొదటి భార్య కాశీభాయ్ గా ప్రియాంక […]
Advertisement
అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా రోల్స్ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. మరి గ్లామర్ డాల్ రోల్స్ చేయడానికి మక్కువ చూపదు. అలా ఒప్పుకుంటే ఓ బర్ఫి లాంటి చిత్రం వచ్చేది కాదు. తాజాగా సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో బాజీరావు మస్తానీ చిత్రంలో ఒక కీ రోల్ చేస్తుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా 85 చీరలు కడుతుందట. కథ పరంగా బాజీరావు మస్తానీ మొదటి భార్య కాశీభాయ్ గా ప్రియాంక చోప్రా చేస్తుండగ… సెకండ్ వైఫ్ రోల్ లో దీపిక పదుకోణ్ చేస్తుంది.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ధరించే చీరలు చాల హైలెట్ అవుతాయిన అంటున్నారు. సవ్వారి అని 11 మీటర్లు పొడవుండే మరాఠీ సంప్రదాయ చీరను ప్రియాంక ధరించనుందని తెలుస్తోంది.రాచరికం ఉట్టి పడేలా ఉండటంతో పాటు అప్పటి కాలాన్ని ప్రతిబింబించాలన్నది భన్సాలీ ఆలోచన. ఇతరత్రా కథ డిమాండ్ మేరకు ముక్క పుడక, చేవి రింగులు వంటి విషయంలో చారిత్రిక అంశాల్ని పరిశీలించి పరిశోధించడం జరిగిందని తెలిపారు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. మరి ఏదైనా భారీ తనం ఉట్టి పడేలా చూపించే సంజయ్ లీలా.. బాజీరావు మస్తానీ చిత్రాన్ని ఏ రెంజ్ లో చెక్కుతున్నారో ఊహిస్తేనే అదొక థ్రిల్ .
Advertisement