దోచేయ్ సినిమాకి కూడా అదే టెక్నిక్..!

కొత్త ద‌ర్శ‌కులు అంటే ఏదో ఒక‌టి కొత్త‌గా చేయ‌డానికి త‌పిస్తారు. ఏదో ఒక స్పెషాలీటి చూపించ‌క పోతే ఇప్ప‌టి కాలంలో డైరెక్ట‌ర్ గా రాణించ‌డం అంత తేలికైన విష‌యం కాదు. ఆ విషయంలో స్వామిరారా డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ‌ డిస్టెంక్ష‌న్ లో పాస్ అయ్యాడ‌నే చెప్పాలి. హీరో నితిన్, క‌ల‌ర్స్ స్వాతి తో చేసిన ఆ చిత్రం అత‌ని మేకింగ్ స్టైల్ ను అబిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఇండ‌స్ట్రీకి ఒక మంచి ఫిల్మే మేక‌ర్ దొరికాడు అన్నంతగా […]

Advertisement
Update:2015-04-11 19:51 IST

కొత్త ద‌ర్శ‌కులు అంటే ఏదో ఒక‌టి కొత్త‌గా చేయ‌డానికి త‌పిస్తారు. ఏదో ఒక స్పెషాలీటి చూపించ‌క పోతే ఇప్ప‌టి కాలంలో డైరెక్ట‌ర్ గా రాణించ‌డం అంత తేలికైన విష‌యం కాదు. ఆ విషయంలో స్వామిరారా డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ‌ డిస్టెంక్ష‌న్ లో పాస్ అయ్యాడ‌నే చెప్పాలి. హీరో నితిన్, క‌ల‌ర్స్ స్వాతి తో చేసిన ఆ చిత్రం అత‌ని మేకింగ్ స్టైల్ ను అబిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఇండ‌స్ట్రీకి ఒక మంచి ఫిల్మే మేక‌ర్ దొరికాడు అన్నంతగా త‌న ప్ర‌తిభను చాటుకున్నాడు. తాజాగా నాగా చైత‌న్య , కృతిస‌న‌న్ లీడ్ రోల్స్ లో చేసిన దోచేయ్ చిత్రం ఎంత‌గానో అభిమానుల్ని అల‌రిస్తుంది. అయితే మేకింగ్ , స్క్రీన్ ప్లే, సినిమాటోగ్ర‌ఫి గ‌మ‌నిస్తే.. స్వామిరారా త‌ర‌హాలోనే చేసిన‌ట్లు స్ప‌ష్టం అవుతుంది. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ సింపుల్ పాయింట్ ను కూడా టైటి్ స్క్రీన్ ప్లే తో గొప్పగా, ఆస‌క్తిగా చెప్పగ‌ల ద‌ర్శ‌కుడు. గ‌తంలో త‌ను చేసిన స్వామిరారా చిత్రంలో ప్ర‌తి సీన్.. ప్ర‌పంచంలో వివిధ భాష‌ల్లో అత‌ను చూసిన చిత్రాల్లో నుంచి తీసుకున్న‌ట్లు..కాపి కొట్టిన చిత్రాల పేర్లు కూడా ఇంటర్ వ్యూలో చెప్పిన విష‌యం తెలిసిందే. ఎక్క‌డ ఎత్తి కొట్టినా.. తెలుగు అభిమానుల‌కు నేటివిటి మిస్ కాకుండా.. ప్రొడ్యూస‌ర్ జేబులు నింప‌గ‌లిగిన డైరెక్ట‌ర్ కే లైఫ్ వుంటుంది. మ‌రి ఆ విష‌యంలో సుధీర్ వ‌ర్మ డిస్టెంక్షన్ కొట్టిన‌ట్లే మ‌రి.

Tags:    
Advertisement

Similar News