శివకి అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ..

పాతికేళ్ల కిందట శివ సినిమా తీయడానికి లక్షల్లోనే ఖర్చయింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తొలి సినిమా కూడా కావడం, నాగార్జున సొంత మూవీ కూడా కావడం, మిగతా యూనిట్ సభ్యులంతా నాగార్జున క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో సినిమా నల్లేరు మీద నడకలా సాగిపోయింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి అత్యధిక లాభాలు అందుకున్నాడు అప్పట్లో. అలనాటి ఆ చిత్రరాజాన్ని ఇప్పటితరానికి హైటెక్  లెవెల్లో అందించడానికి సిద్ధమయ్యారు నాగ్. శివ సినిమా డిజిటలైజేషన్ కోసం […]

Advertisement
Update:2015-04-11 08:51 IST

పాతికేళ్ల కిందట శివ సినిమా తీయడానికి లక్షల్లోనే ఖర్చయింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తొలి సినిమా కూడా కావడం, నాగార్జున సొంత మూవీ కూడా కావడం, మిగతా యూనిట్ సభ్యులంతా నాగార్జున క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో సినిమా నల్లేరు మీద నడకలా సాగిపోయింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి అత్యధిక లాభాలు అందుకున్నాడు అప్పట్లో. అలనాటి ఆ చిత్రరాజాన్ని ఇప్పటితరానికి హైటెక్ లెవెల్లో అందించడానికి సిద్ధమయ్యారు నాగ్. శివ సినిమా డిజిటలైజేషన్ కోసం ఏకంగా 5కోట్లు ఖర్చుపెట్టారు. ఖర్చు అయితే బాగానే పెట్టారు కానీ ఆ పెట్టిన డబ్బు తిరిగొస్తుందా అనేదే ఇప్పుడు సమస్య.

శివ డిజిటల్ ప్రింట్లను ఈ నెల 15న లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వేసవి శెలవులు కాబట్టి కుర్రాళ్లు టైం
పాస్ కోసం శివ సినిమా చూస్తారనడంలో సందేహం లేదు. కాకపోతే ఇప్పటికే టీవీల్లో చాలాసార్లు ఈ సినిమా చూసేసిన వాళ్లు మళ్లీ 150 రూపాయలు పెట్టుకొని థియేటర్లకు వెళ్లి శివను మరోసారి చూస్తారా అనేదే అనుమానాస్పదం. అయితే యూనిట్ మాత్రం శివ డిజిటల్ వెర్షన్ పైసా వసూల్ అంటోంది. అప్పట్లో డీటీఎస్ లేదు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అనిపించలేదని, ఇప్పుడు కొత్త శివను డీటీఎస్ ఎఫెక్ట్ లో చూస్తే కెవ్వుకేక అంటారని వాదిస్తోంది. మరోవైపు విజువల్స్ లో కూడా రిచ్ లుక్ తీసుకొచ్చేందుకు అక్కడక్కడ కలర్ యాడింగ్ కూడా చేశారట. యూనిట్ ఎన్ని చెప్పినా ఈకాలంలో 5 కోట్లు తిరిగొస్తాయా అనేది మాత్రం నిస్సందేహంగా సందేహమే. కాకపోతే.. ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని నాగార్జున మళ్లీ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి డబ్బుల గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు
Tags:    
Advertisement

Similar News