అడుగడుగునా పోలీసు బాస్‌ల తప్పిదాలే...
నల్గొండలో ఉగ్రదాడిని ఎదుర్కొని హంతకులను అంతం చేశారు. ప్రస్తుతానికి పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ ఇక్కడే పోలీస్ వ్యవస్థకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరెన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట బస్ స్టాండ్‌లో కాల్పుల దగ్గరి నుంచి శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగే వరకు పోలీసుల వైపు నుంచి నిర్లక్ష్యమో, వైఫల్యమో, వ్యూహాం లేకపోవడమో కనిపించింది. అందుకే ఇద్దరికి మరొకరు బలవ్వాల్సి వచ్చింది. ఎస్‌ఐ సిద్ధయ్య చావుబతుకుల పోరాటానికీ కారణమైంది. బస్ స్టాండ్‌లో కాల్పులు జరినప్పుడు నిందితులను పట్టుకోవడంలో […]
Advertisement
నల్గొండలో ఉగ్రదాడిని ఎదుర్కొని హంతకులను అంతం చేశారు. ప్రస్తుతానికి పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ ఇక్కడే పోలీస్ వ్యవస్థకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరెన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట బస్ స్టాండ్‌లో కాల్పుల దగ్గరి నుంచి శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగే వరకు పోలీసుల వైపు నుంచి నిర్లక్ష్యమో, వైఫల్యమో, వ్యూహాం లేకపోవడమో కనిపించింది. అందుకే ఇద్దరికి మరొకరు బలవ్వాల్సి వచ్చింది. ఎస్‌ఐ సిద్ధయ్య చావుబతుకుల పోరాటానికీ కారణమైంది. బస్ స్టాండ్‌లో కాల్పులు జరినప్పుడు నిందితులను పట్టుకోవడంలో పోలీసులు కొంత వైఫల్యం చెందారు. రోడ్డుపైకి వచ్చి ఎంపీటీసీ సభ్యుడు దొరబాబుపై ఉగ్రవాదాలు కాల్పులు జరిపారు. ఆ తర్వాతే అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో వారిని ఎదుర్కోవడంలోనూ, ఆ తర్వాత వారిని వెతకడంలోనూ కొంత వైఫల్యం చెందారు. బస్ స్టాండ్‌లో సీసీ కెమెరాల్లో స్పష్టత లేకపోవడమూ ఇందుకు కారణం. కాల్పుల సమయంలో మిగిలిన పోలీసులు షాక్‌లోకి వెళ్లడమూ మరికొంత కారణం. అసలు విషయం బయటకు వచ్చే సరికే నిందితులు సేఫ్టీ జోన్‌కు వెళ్లిపోయారు. ఆ రెండు రోజులూ అక్కడే ఉన్నారు.
బస్ స్టాండ్‌లో తనిఖీలకు వెళ్లేటప్పుడు పూర్తి భద్రతతో పోలీసులు వెళ్లలేదు. శనివారం ఉదయం నిందితుల ఆచూకీ తెలిసినప్పుడైనా పూర్తి భద్రతతో వెళ్లారా అంటే అదీ లేదు. ఉదయం ఆరున్నర నుంచి 8.30 వరకు నిందితులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. అంటే రెండు గంటలు. బస్ స్టాండ్ ఘటన తర్వాత సూర్యాపేటలోనే తిష్టవేసిన ఉన్నతాధికారుల వ్యూహాలు ఏమయ్యాయి? దట్టమైన అడవినే జల్లెడబట్టి మావోయిస్టులను పట్టుకునే పోలీసు వ్యూహాలు ఒంటరిగా పారిపోతున్న ఇద్దరిని పట్టుకోవడంలో ఎందుకు దారి తప్పాయి. ఉగ్రవాదులెక్కడా జనాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులపైకి కాల్పులు జరపలేదు. పోలీసులను చంపడానికే వచ్చామన్నట్టు నేరుగా జీపును డ్రైవ్ చేస్తున్న నాగరాజు దగ్గరకొచ్చి పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారంతా వివిధ స్టేషన్లలో పని చేసే సివిల్ పోలీసులే. ఎవరూ స్పెషలిస్టులు కారు. ఉదయం నుంచి రెండు గంటల సమయంలో ప్రత్యేక బలగాలను నిందితుల కోసం పంపలేక పోయారంటే వ్యూహాత్మక తప్పిదాలు చాలానే చేశారనిపిస్తోంది. జానకీపురం వెళ్లినప్పుడు కూడా ఏ ఒక్కరూ బుల్లెట్‌ప్రూవ్ జాకెట్ వేసుకోలేదు. తొందరలో వేసుకోలేదా? వేసుకోవడానికి అవి లేవా అన్నది కూడా స్పష్టం కావాలి. ఏది జరిగినా అది పోలీసుల అధికారుల తప్పిదమే. ఇందులో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఏ ఒక్క పోలీసుదీ తప్పు కాదు. ఎందుకంటే యుద్ధంలో పాల్గొనే వాడు శత్రువుని చంపడానికే చూస్తాడు. కానీ యుద్ధాన్ని నడిపించే వాడు… వ్యూహాలు రచిస్తూ తమ వారిని కాపాడుకోవాలి. ఆ విషయంలోనే పోలీసు ఉన్నతాధికారులు తప్పు చేశారేమోనన్న అనుమానం కలుగుతోంది.-ఎస్
Advertisement