ఆంధ్ర అధికారులకు తెలంగాణ కష్టాలు
తెలంగాణ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. తెలంగాణ సచివాలయంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై తీవ్ర ఆందోళన చెందుతున్న ఏపీ అధికారులు అవసరమైతే గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారు. సుమారు 20 మంది అధికారులను ప్రాంతం ఆధారంగా బదిలీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నారు. బదిలీ చేసినా ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 107 […]
Advertisement
తెలంగాణ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. తెలంగాణ సచివాలయంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై తీవ్ర ఆందోళన చెందుతున్న ఏపీ అధికారులు అవసరమైతే గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారు. సుమారు 20 మంది అధికారులను ప్రాంతం ఆధారంగా బదిలీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నారు. బదిలీ చేసినా ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 107 మంది తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్నారు. ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడంతో వర్క్ టు సర్వ్ ఆర్డర్ కింద ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించిన సమయంలో వీరిని తెలంగాణకు కేటాయించారు. అయితే జూన్‌లో ప్రమోషన్లు పొందాలని భావిస్తున్న తెలంగాణ సచివాలయ అధికార్లు, ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉంటే సీనియార్టీ ప్రకారం తమకు ప్రమోషన్లలో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి మరీ వారిని బదిలీ చేయించినట్లు తెలియవచ్చింది. దీనికి ఆంధ్రప్రదేశ్ అధికారులు అభ్యంతరం చెబుతున్నా వినే నాధులు లేరు. తమకు ఎదురైన సమస్యను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై ప్రధాన కార్యదర్శి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కావాలని అడిగినట్లు అధికారులు చెబుతున్నారు. సచివాలయంలో తమకు పోస్టింగ్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లడానికీ కూడా వెనుకాడమని అధికారులంటున్నారు.
Advertisement