వైఫల్యంతోనే ఎస్పీపై వేటు!
సూర్యాపేట ఘటనలో పోలీసు వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అర్ధరాత్రి పూట, పైగా దొంగల కోసం వేట కొనసాగిస్తున్నప్పుడు పోలీసులు సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి. గతంలోనే ఇద్దరు దొంగల్ని పట్టుకున్నామని స్వయంగా మంత్రులే చెబుతున్నప్పుడు ఆయుధాలతో ఈ పోలీసులు ఎందుకు వెళ్లలేదో తెలియడం లేదు. పైగా ఘటన జరిగిన వెంటనే సీరియస్‌గా స్పందించలేదన్న విమర్శలూ వస్తున్నాయి. రోడ్డు మీదకు వెళ్లి వచ్చీ పోయే కార్లను ఆపి, ఒకరిపై కాల్పులు జరిపిన తర్వాతే నిందితులు తప్పించుకున్నారు. […]
Advertisement
సూర్యాపేట ఘటనలో పోలీసు వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అర్ధరాత్రి పూట, పైగా దొంగల కోసం వేట కొనసాగిస్తున్నప్పుడు పోలీసులు సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి. గతంలోనే ఇద్దరు దొంగల్ని పట్టుకున్నామని స్వయంగా మంత్రులే చెబుతున్నప్పుడు ఆయుధాలతో ఈ పోలీసులు ఎందుకు వెళ్లలేదో తెలియడం లేదు. పైగా ఘటన జరిగిన వెంటనే సీరియస్‌గా స్పందించలేదన్న విమర్శలూ వస్తున్నాయి. రోడ్డు మీదకు వెళ్లి వచ్చీ పోయే కార్లను ఆపి, ఒకరిపై కాల్పులు జరిపిన తర్వాతే నిందితులు తప్పించుకున్నారు. అంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అక్కడే ఉన్నట్టు లెక్క.. అంటే అంత సమయాన్ని పోలీసులు వృధా చేశారు. ఆ తర్వాత కూడా నిందితులను పట్టుకోలేకపోయారు. దాని ప్రభావంగానే నల్గొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావును బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో విక్రంజిత్ దుగ్గల్‌ను వేశారు.-ఎస్
Advertisement