భారత్ క్రికెట్ టీం కోచ్‌గా సచిన్ టెండూల్కర్
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ టీం సారథ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న డంకన్ ప్లెచర్ స్థానంలో ఎవరొస్తారన్న దానిపై కొన్ని వారాలుగా సచిన్ పేరు వినపడుతున్నా దానికి సరైన ఆధారాలు లభించలేదు. అయితే ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో పేలవమైన ఆట తీరు కనబరిచి ఇంటి ముఖం పట్టిన భారత్‌కు సచిన్ కన్నా మంచి కోచ్ ఎవరుంటారన్న ఉద్దేశ్యంతో ఆయనను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎంపిక చేసింది. సచిన్‌కు టీం సారధ్య […]
Advertisement
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ టీం సారథ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న డంకన్ ప్లెచర్ స్థానంలో ఎవరొస్తారన్న దానిపై కొన్ని వారాలుగా సచిన్ పేరు వినపడుతున్నా దానికి సరైన ఆధారాలు లభించలేదు. అయితే ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో పేలవమైన ఆట తీరు కనబరిచి ఇంటి ముఖం పట్టిన భారత్‌కు సచిన్ కన్నా మంచి కోచ్ ఎవరుంటారన్న ఉద్దేశ్యంతో ఆయనను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎంపిక చేసింది. సచిన్‌కు టీం సారధ్య బాధ్యతలు కట్టబెట్టే విషయంలో ప్రస్తుత కెప్టన్ ఎం.ఎస్.. ధోనీ, విరాట్ కోహ్లీ కీలకపాత్ర వహించారని తెలుస్తోంది. బీసీసీఐ మాజీ చీఫ్ ఎన్. శ్రీనివాసన్‌ను, టీం డైరెక్టర్ రవిశాస్త్రిని కూడా సచిన్ తుది ఎంపికకు ముందు సంప్రదించారని తెలుస్తోంది. ఐ.పి.ఎల్. మ్యాచ్ ముగిసిన తర్వాత సచిన్ టీం ఇండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించవచ్చు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో సచిన్ ఐసీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.-పిఆర్
Advertisement