ఏపీ కాంట్రాక్టు సిబ్బందికి ఉద్వాసన!
ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిశాఖలోని 138 మంది కాంట్రాక్టు సిబ్బందికి ప్రభుత్వం ఉద్వాసన పలుకుతుంది. గ్రామీణాభివృద్ధి కమిషనరేట్‌లో.. ఉపాధి హామీ పథకం, ఐడబ్ల్యూఎంపీ, ఎస్‌ఆర్‌డీఎస్, సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఇకముందు కొనసాగించరాదని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి వారు ఉద్యోగాల్లో కొనసాగించవద్దని పేర్కొంటూ ఇచ్చిన ఆదేశాల ఫైలుపై గ్రామీణాభివృద్ధి కమిషనర్ బి.రామాంజనేయులు సంతకం చేసినట్లు సమాచారం. ఈ కార్యాలయంలో ఇకనుంచి ప్రయివేటు, రిటైర్డ్ ఉద్యోగులను ఉంచవద్దని, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పని చేయాలని […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిశాఖలోని 138 మంది కాంట్రాక్టు సిబ్బందికి ప్రభుత్వం ఉద్వాసన పలుకుతుంది. గ్రామీణాభివృద్ధి కమిషనరేట్‌లో.. ఉపాధి హామీ పథకం, ఐడబ్ల్యూఎంపీ, ఎస్‌ఆర్‌డీఎస్, సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఇకముందు కొనసాగించరాదని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి వారు ఉద్యోగాల్లో కొనసాగించవద్దని పేర్కొంటూ ఇచ్చిన ఆదేశాల ఫైలుపై గ్రామీణాభివృద్ధి కమిషనర్ బి.రామాంజనేయులు సంతకం చేసినట్లు సమాచారం. ఈ కార్యాలయంలో ఇకనుంచి ప్రయివేటు, రిటైర్డ్ ఉద్యోగులను ఉంచవద్దని, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పని చేయాలని ఈ ఆదేశాల సారాంశం. ఇక్కడ ఆరేళ్లుగా 50 మంది వరకు రిటైర్డు అధికారులు, ఉన్నత విద్య అభ్యసించిన టెక్నికల్, సామాజిక నిపుణులైన యువతీ, యువకులూ పని చేస్తున్నారు. వీరుకాక ఇటీవల కాలంలో పలు రాజకీయ నియామకాలు జరిగాయనే విమర్శలూ ఉన్నాయి. ‘ఉపాధి’ నిర్వహణ వ్యయం భారం కావడం, విచ్చలవిడి వ్యయం, సంబంధిత శాఖల్లో పనులు సరిగా లేకుండా జీతాలు చెల్లించాల్సి రావడం కూడా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణంగా చెబుతున్నారు._పిఆర్
Advertisement