మా... ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నిర్వహణకు నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫలితాలు వెల్లడించవద్దని స్పష్టం చేసింది. సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయిన నేపథ్యంలో ఎన్నికలు వివాదాస్పదమయ్యాయి. మా అధ్యక్ష పదవికి ప్రస్తుత మా అధ్యక్షుడు మురళీమోహన్ సినీ హీరో జయసుధను ప్రతిపాదించగా, మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ను ఎన్నికల రంగంలోకి దింపారు. వీరిద్దరితో ఉన్న నటులు ఒకరిపై ఒకరు […]
Advertisement
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నిర్వహణకు నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫలితాలు వెల్లడించవద్దని స్పష్టం చేసింది. సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయిన నేపథ్యంలో ఎన్నికలు వివాదాస్పదమయ్యాయి. మా అధ్యక్ష పదవికి ప్రస్తుత మా అధ్యక్షుడు మురళీమోహన్ సినీ హీరో జయసుధను ప్రతిపాదించగా, మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ను ఎన్నికల రంగంలోకి దింపారు. వీరిద్దరితో ఉన్న నటులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీధికెక్కిన నేపథ్యంలో ఒ వర్గం వారు ఎన్నికలు జరగకుండా స్టే ఇవ్వాలని కోరుతూ కోర్టు గడపెక్కారు. దీంతో విచారణ అనంతరం ఎన్నికల నిర్వహణకు కోర్టు అనుమతించింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఓట్ల లెక్కింపు చేపట్ట వద్దని, ఫలితాలు ప్రకటించవద్దని, ఎన్నికల ప్రక్రియ మొత్తం వీడియోలో చిత్రీకరించాలని ఆదేశించింది. -పి.ఆర్.
Advertisement