పుష్కరాలపై ఏపీ సీఎం సమీక్ష
ఈయేడాది జులై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్షించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేట్టు వీటిని నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన నిధులు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.దీనిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని కేంద్రాని కోరినట్టు ఆయన తెలిపారు. ఈ పుష్కరాలకు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు. అలాగే శృంగేరి మఠాధిపతులను కూడా వీటిలో పాల్గొన వలసిందిగా కోరతామని ఆయన […]
ఈయేడాది జులై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్షించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేట్టు వీటిని నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన నిధులు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.దీనిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని కేంద్రాని కోరినట్టు ఆయన తెలిపారు. ఈ పుష్కరాలకు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు. అలాగే శృంగేరి మఠాధిపతులను కూడా వీటిలో పాల్గొన వలసిందిగా కోరతామని ఆయన అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నిచోట్ల ఘాట్‌లు ఏర్పాటు చేయవచ్చో పరిశీలించి తగిన ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్కరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు. – పి.ఆర్.