ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: శివాజీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని సినీ హీరో, బీజేపీ నాయకుడు శివాజీ డిమాండు చేశారు. అవిభాజ్యత ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో ఉండేవారని, విడిపోయిన తర్వాత కష్టాలపాలవుతున్నారని ఆయన అన్నారు. మద్రాసు నుంచి అక్కడి ప్రజలు తరిమేస్తే హైదరాబాద్‌ వచ్చి పడ్డామని, ఇపుడు హైదరాబాద్‌ నుంచి తరిమేస్తే బంగాళాఖాతం తీరానికి చేరామని ఆయన గుర్తు చేశారు. యువత ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు. తనకు రాష్ట్ర […]

Advertisement
Update:2015-03-25 01:00 IST
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని సినీ హీరో, బీజేపీ నాయకుడు శివాజీ డిమాండు చేశారు. అవిభాజ్యత ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో ఉండేవారని, విడిపోయిన తర్వాత కష్టాలపాలవుతున్నారని ఆయన అన్నారు. మద్రాసు నుంచి అక్కడి ప్రజలు తరిమేస్తే హైదరాబాద్‌ వచ్చి పడ్డామని, ఇపుడు హైదరాబాద్‌ నుంచి తరిమేస్తే బంగాళాఖాతం తీరానికి చేరామని ఆయన గుర్తు చేశారు. యువత ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తాను ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడం ఆపబోనని శివాజీ తెలిపారు. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని, ప్రత్యేక హోదాకు మరో ప్రత్యమ్నాయం లేదని ఆయన అన్నారు. తెలుగువారి తరఫున అడిగేవారే లేకుండా పోయారని, రాజకీయాలే రాష్ట్ర ప్రయోజనాల కన్నా ముఖ్యంగా కనపడుతున్నాయని ఆయన అన్నారు. తనకు పార్టీ కన్నారా ష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే తన తొలి ప్రాధాన్యమని శివాజీ తెలిపారు. తెలంగాణ విభజన సందర్భంలో ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చాలని ఆయన డిమాండు చేశారు. వర్షాలు లేక అల్టాడిపోతున్న రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారమని ఆయన అన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానని ప్రధాని నరేంద్రమోడి కూడా చెప్పారని, దాన్ని సాకారం చేయాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా మన హక్కని, తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తిగా ప్రత్యేక హోదా ఉద్యమం సాగాలని ఆయన కోరారు.

 

Tags:    
Advertisement

Similar News