తెలంగాణ వ్యాప్తంగా 'షి' బృందాలు

హైదరాబాద్‌ నగరంలో పబ్లిక్‌ స్థలాల్లో స్త్రీలను వేధించేవారి పనిపట్టడానికి తెలంగాణ పోలీసులు ఏర్పాటుచేసిన ‘షి’ బృందాలు చక్కటి ఫలితాలను ఇచ్చాయి. బస్టాపులలో, కళాశాలల వద్ద దేవాలయాలు తదితర ప్రదేశాల్లో అమ్మాయిలను, ఒంటరి స్త్రీలను వేధించే పోకిరీల పనిపట్టడానికి హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌లు ‘షి’ బృందాలను ఏర్పాటు చేశారు. అమ్మాయిలను వేధిస్తుండగా ఈ బృందాలు సాక్ష్యాధారాలతో సహా చాలామంది యువకులని, మధ్య వయసువాళ్ళను అరెస్ట్‌చేశారు. వాళ్ళ కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇప్పించారు. అయినా మారని వాళ్ళను కోర్టులో […]

Advertisement
Update:2015-03-24 07:03 IST

హైదరాబాద్‌ నగరంలో పబ్లిక్‌ స్థలాల్లో స్త్రీలను వేధించేవారి పనిపట్టడానికి తెలంగాణ పోలీసులు ఏర్పాటుచేసిన ‘షి’ బృందాలు చక్కటి ఫలితాలను ఇచ్చాయి. బస్టాపులలో, కళాశాలల వద్ద దేవాలయాలు తదితర ప్రదేశాల్లో అమ్మాయిలను, ఒంటరి స్త్రీలను వేధించే పోకిరీల పనిపట్టడానికి హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌లు ‘షి’ బృందాలను ఏర్పాటు చేశారు. అమ్మాయిలను వేధిస్తుండగా ఈ బృందాలు సాక్ష్యాధారాలతో సహా చాలామంది యువకులని, మధ్య వయసువాళ్ళను అరెస్ట్‌చేశారు. వాళ్ళ కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇప్పించారు. అయినా మారని వాళ్ళను కోర్టులో హాజరుపరిచి శిక్షలు పడేలా చూశారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో స్త్రీలను వేధించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ‘షి’ బృందాలపట్ల మహిళలు, ముఖ్యంగా కాలేజీ విద్యార్ధినులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ మహిళలను వేధించేవారిపట్ల కటినంగా వ్యవహరించడంకూడా మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో మహిళలను వేధించాలంటే బయపడే పరిస్థితి, ఈ మార్పును గమనించిన పోలీసులు, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘షి’ బృందాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘షి’ బృందాలు పని ప్రారంభిస్తాయి. ‘షి’ బృందాల్లో పనిచేసే పోలీసులకు ఇటీవలే శిక్షణ కూడా ఇచ్చారు. మహిళల వేధింపులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని కూడా నిర్ణయించారు.

Tags:    
Advertisement

Similar News