'మా' అధ్యక్ష పదవి ఎవరి సొంతం?

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. ఈయనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, హీరో నవదీప్‌, ఉత్తేజ్‌ వెంట వచ్చారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఈ బాధ్యతలు చేపట్టడానికి కావలసిన అర్హతలన్నీ తనకు ఉన్నాయని అన్నారు. తన వైపు మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు ఉండడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. హీరోయిన్‌ జయసుధ తనపై పోటీకి దిగుతున్నా తన ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని రాజేంద్రప్రసాద్‌ […]

Advertisement
Update:2015-03-21 06:20 IST

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. ఈయనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, హీరో నవదీప్‌, ఉత్తేజ్‌ వెంట వచ్చారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఈ బాధ్యతలు చేపట్టడానికి కావలసిన అర్హతలన్నీ తనకు ఉన్నాయని అన్నారు. తన వైపు మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు ఉండడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. హీరోయిన్‌ జయసుధ తనపై పోటీకి దిగుతున్నా తన ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మొత్తం మీద ‘మా’ కార్యవర్గ ఎన్నికలు.. సస్పెన్స్‌కు తెరతీశాయి. రాజేంద్రప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కావచ్చునని మొదట భావించినా.. ఆ తర్వాత పరిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న మురళీమోహన్ తిరిగి పోటీచేస్తారని భావించినప్పటికీ.. రాజేంద్రప్రసాద్ తాను పోటీ చేస్తానని ప్రకటించడంతో ఆయన విరమించుకున్నారు. అయితే అనూహ్యంగా సహజ నటి జయసుధను తెరపైకి వచ్చారు. రాజేంద్రప్రసాద్‌కు మెగా ఫ్యామిటీ నుంచి నాగబాబు మద్దతు ప్రకటించడం ఇక్కడ చెప్పుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమలో రెండు వర్గాలకు చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి… ఓ వర్గం ఓట్లు రాజేంద్రప్రసాద్‌కే వచ్చినా.. మరో వర్గం ఓట్లు సహజనటికి రావచ్చునని అంచనా. అప్పుడు పోటీ బలంగా ఉంటుంది. రాజకీయంగా చూస్తే జయసుధ టీడీపీకి కాకుండా కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఒక దశలో వైకాపాకు కూడా దగ్గరయ్యారు. అయితే టీడీపీకి చెందిన మురళీమోహన్ ఆమెను బరిలోకి దింపడం ఇపుడు చర్చనీయాంశం అయ్యింది. అటు జయసుధ ఎంపిక వెనుక.. దాసరి నారాయణరావు హస్తం కూడా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా రాజేంద్రప్రసాద్‌కు గట్టిపోటీ తథ్యంగా కనిపిస్తోంది. రాజేంద్రప్రసాద్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, యువ కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను జయసుధకు మద్దతు ఇస్తున్నానని మురళీమోహన్ వ్యాఖ్యానించడం విశేషం.

Tags:    
Advertisement

Similar News