భారత్‌కు క్రికెట్‌లో అన్నీ మంచి శకునములే!

క్రికెట్‌ క్రీడాభిమానుల్లో ఇప్పుుడెక్కడ చూసినా ఒకటే చర్చ. ప్రపంచకప్పుు సెమీఫైనల్లో అగ్రజట్టు ఆస్ట్రేలియాపై భారత్‌ గెలవగలదా అని? ఇటీవల పూర్తయిన అనేక సిరీస్‌ల్లో చెత్తగా ఆడి ఓడిన భారత్‌ ఈసారి ప్రపంచ కప్‌లో విజయం నమోదు చేయగలదా అని? అది సాధ్యమా అనుకునే మీమాంస ఉన్నవారు మూడు దశాబ్దాల క్రితం 1985లో బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్‌ వరల్డ్‌ సిరీస్‌లో భారత్‌ సృష్టించిన చరిత్ర గుర్తుకు తెచ్చుకోవలసిందే. అప్పట్లోనూ ఇదే పరిస్థితి. సరిగ్గా అప్పుడు… ఇదే మార్చినెల 3 […]

Advertisement
Update:2015-03-21 11:30 IST

క్రికెట్‌ క్రీడాభిమానుల్లో ఇప్పుుడెక్కడ చూసినా ఒకటే చర్చ. ప్రపంచకప్పుు సెమీఫైనల్లో అగ్రజట్టు ఆస్ట్రేలియాపై భారత్‌ గెలవగలదా అని? ఇటీవల పూర్తయిన అనేక సిరీస్‌ల్లో చెత్తగా ఆడి ఓడిన భారత్‌ ఈసారి ప్రపంచ కప్‌లో విజయం నమోదు చేయగలదా అని? అది సాధ్యమా అనుకునే మీమాంస ఉన్నవారు మూడు దశాబ్దాల క్రితం 1985లో బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్‌ వరల్డ్‌ సిరీస్‌లో భారత్‌ సృష్టించిన చరిత్ర గుర్తుకు తెచ్చుకోవలసిందే. అప్పట్లోనూ ఇదే పరిస్థితి. సరిగ్గా అప్పుడు… ఇదే మార్చినెల 3 తేదీన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను (మెల్‌బోర్న్‌లో) భారత్‌ కంగు తినిపించింది. రెండు రోజుల సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను సునాయాసంగా ఓడించింది. ఆదే సిడ్నీ మైదానంలోనే ఈసారి ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అప్పటి విజయంలో ‘మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌’ రవిశాస్త్రి ఇప్పుుడు భారత జట్టుకు ‘డైరెక్టర్‌’!… గుడ్‌లక్‌ ఇండియా!

Tags:    
Advertisement

Similar News