Telugu Global
NEWS

కాంగ్రెస్‌లో చేరిన విజయా రెడ్డి.. టికెట్‌పై హామీ వచ్చిందా?

దివంగత నేత పీజేఆర్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె మేయర్ పోస్టును ఆశించినట్టు సమాచారం. అయితే సీఎం కేసీఆర్ మాత్రం.. టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నాయకుడు కేకే కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పోస్టును కట్టబెట్టారు. దీంతో అప్పటినుంచి విజయారెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అంతేకాక ఆమె వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా […]

Vijaya-Reddy-joined-Congress-party
X

దివంగత నేత పీజేఆర్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె మేయర్ పోస్టును ఆశించినట్టు సమాచారం. అయితే సీఎం కేసీఆర్ మాత్రం.. టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నాయకుడు కేకే కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పోస్టును కట్టబెట్టారు. దీంతో అప్పటినుంచి విజయారెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

అంతేకాక ఆమె వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ లేదా ఖైరతాబాద్ టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ లో ఈ రెండు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ ఉన్నారు. వీరిని కాదని విజయారెడ్డికి టికెట్ దక్కే అవకాశం లేదు.. దీంతో ఈ విషయాన్ని గ్రహించి ఆమె పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

విజయారెడ్డి తండ్రి పీజేఆర్ కు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో గట్టిపట్టుంది. ఇప్పటికీ ఆయన అనుచరులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. గత 2014, 18 ఎన్నికల్లో ఆయన జూబ్లీహిల్స్ నుంచి పోటీచేసి విజయం సాధించలేకపోయారు. దీంతో ఈ దఫా ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కుతుందో లేదో క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే విజయా రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ తెచ్చుకున్న తర్వాతే ఆ పార్టీలో చేరినట్టు సమాచారం. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట ఆమె టికెట్‌ను ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే మరోవైపు ఈ మూడు నియోజకర్గాలకు కాంగ్రెస్ ఆశావహులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయారెడ్డి ఏ నియోజకవర్గంలో పోటీచేస్తారో వేచి చూడాలి.

First Published:  23 Jun 2022 12:37 PM IST
Next Story