Telugu Global
NEWS

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు.. హైకమాండ్‌కి చేరిన కీలక రిపోర్ట్.!

తెలంగాణ కాంగ్రెస్ బలోపేతానికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. నాయకుల ధోరణితో పార్టీ తీరు మారడం లేదు. కొన్ని నెలలుగా అధిష్టానం తరపున రాహుల్ గాంధీనే స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. వాళ్లకు అనేక సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే నాయకులు ఐక్యంగా ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రజల్లో ఉండే నేతలకే కాంగ్రెస్ తరపున టికెట్లు వస్తాయని కుండ బద్దలు కొట్టారు. ఆ తర్వాత వరంగల్ […]

తెలంగాణ కాంగ్రెస్
X

తెలంగాణ కాంగ్రెస్ బలోపేతానికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. నాయకుల ధోరణితో పార్టీ తీరు మారడం లేదు. కొన్ని నెలలుగా అధిష్టానం తరపున రాహుల్ గాంధీనే స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. వాళ్లకు అనేక సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే నాయకులు ఐక్యంగా ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రజల్లో ఉండే నేతలకే కాంగ్రెస్ తరపున టికెట్లు వస్తాయని కుండ బద్దలు కొట్టారు. ఆ తర్వాత వరంగల్ సభలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

సభ తర్వాత రోజు గాంధీభవన్ వేదికగా తెలంగాణ నేతలకు మరోసారి దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. ఇంతలా వారిని మోటివేట్ చేసినా.. కాంగ్రెస్ నాయకుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. కొంత మంది నాయకులు టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారని.. వాళ్లు ప్రజల్లోకి వెళ్లడానికి పెద్దగా ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది? నాయకుల పనితీరు ఎలా ఉన్నదనే విషయాలపై అధిష్టానం గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు తెలుస్తున్నది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణ నాయకులపై ఎప్పటికప్పుడు రిపోర్టును అధిష్టానానికి పంపిస్తున్నారు. తాజాగా పంపిన రిపోర్టును చూసి అధిష్టానం పలువురు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో మాదిరే అంతర్గత విభేదాలతో పార్టీ కొనసాగుతున్నదని, ప్రజలు ఇవి చూసి కాంగ్రెస్ అంటేనే ఈసడించుకునే పరిస్థితి ఉన్నదని నివేదికలో పేర్కొన్నారు. కేవలం కొద్ది మంది నేతలు మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటూ తమ ప్రాభవాన్ని పెంచుకుంటున్నారని ఆ నివేదికలో ఉన్నది.

మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేనట్లు నివేదికలో వివరించారు. ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకుంటే దక్షిణ తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ పరిస్థితి పర్వాలేదనిపించేలా ఉన్నదని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో గత ఎన్నికల తర్వాత నుంచి పరిస్థితి ఏ మాత్రం మారలేదని నివేదికలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ నివేదిక అధిష్టానం వద్ద ఉండటంతో తెలంగాణ నాయకుల్లో ఆందోళన నెలకొన్నది. బయట అడుగుపెట్టని నేతల నుంచి జిల్లాల్లో పరిస్థితి మెరుగుపరచని నాయకులు వరకు అందరిలో గుబులు పట్టుకున్నది. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వారి పేర్లు కూడా ఉండటంతో వారిలో మరింత ఆందోళన మొదలైంది. మరి ఈ నివేదికపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  7 Jun 2022 1:58 PM IST
Next Story