Telugu Global
WOMEN

చలికాలం చర్మ సౌందర్యం కోసం చిట్కాలు!

చలికాలం వచ్చిందంటే రకరకాల చర్మ సమస్యలు మొదలవుతాయి. చర్మం పొడిబారడం, పగలడం, జుట్టు పొడిబారడం వంటివి ఈ సీజన్‌లో ఎక్కువ.

చలికాలం చర్మ సౌందర్యం కోసం చిట్కాలు!
X

చలికాలం వచ్చిందంటే రకరకాల చర్మ సమస్యలు మొదలవుతాయి. చర్మం పొడిబారడం, పగలడం, జుట్టు పొడిబారడం వంటివి ఈ సీజన్‌లో ఎక్కువ. మరి వీటికి చెక్ పెట్టేదెలా..

చలికాలంలో చర్మం పొడిబారడం సహజం. కాబట్టి స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చలి వల్ల పొడిబారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చేందుకు స్క్రబ్ చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే నేచురల్ స్క్రబర్లు వాడొచ్చు. లేదా కాఫీపొడి, దాల్చినచెక్క పౌడర్‌‌లో తేనె కలిపి మృదువుగా మర్దన చేయొచ్చు. స్క్రబింగ్ వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు చర్మంపైపొరకు పోషణ అందుతుంది. మృతకణాలు తొలగిపోతాయి.

పొడిచర్మం సమస్య ఉన్నవాళ్లు ఈ సీజన్‌లో అప్పుడప్పుడు ఫేస్ మాస్క్‌లు వేస్తుండాలి. పెరుగు, పాలు, వెన్న, రోజ్ వాటర్ లేదా నీటిశాతం ఎక్కువ ఉన్న కూరగాయలు, పండ్ల గుజ్జుతో ఫేస్ మాస్క్‌లు వేసుకోవచ్చు. ఇలా తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో తేమ శాతం పోకుండా ఉంటుంది.

చలికాలం జుట్టు పొడిబారకుండా కండిషనర్‌‌తో తలస్నానం చేయాలి. అలాగే వీలైనంత వరకూ తక్కువ సార్లు తలస్నానం చేస్తే మంచిది. వీలున్నప్పుడల్లా జుట్టుకి నూనె రాస్తే పొడిబారకుండా ఉంటుంది.

చలికాలంలో ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది. కాబట్టి స్నానాన్ని త్వరగా ముగించాలి. స్నానానికి చన్నీటినే వాడాలి. అలాగే ఈ సీజన్‌లో తరచూ ఫేస్ వాష్ చేసుకునే అలవాటుని మానుకోవాలి. రోజులో రెండుసార్లు ముఖం కడిగితే సరిపోతుంది.

చలికి పెదవులు పగిలిపోతే.. పడుకునేముందు వెన్న లేదా నెయ్యి పూసుకోవాలి. ఇలా చేస్తే తెల్లారేసరికి పెదవులు తేమగా మారతాయి. పాదాల పగుళ్లకు కూడా వెన్న రాసుకోవచ్చు.

పొడిచర్మం సమస్య ఉన్నవాళ్లు ఈ సీజన్‌లో నీటిశాతం ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువ తినాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పక మాయిశ్చరైజర్ వాడాలి. చల్లగాలికి చర్మం ఎక్స్‌పోజ్ అవ్వకుండా జాగ్రత్తపడాలి.

First Published:  2 Nov 2023 11:31 AM IST
Next Story