ఏపీలో విద్యార్థులకు బాసటగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జనవరి 3న వైసీపీ తలపెట్టిన ఆందోళనన కార్యక్రమాన్ని జనవరి 29కి ఆ పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. అయితే, 3వ తేదీన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా 29న నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Previous Article108 డ్రైవర్లకు గుడ్ న్యూస్..జీతాలు పెంపు
Next Article ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో టెండర్లు పిలిచిన కేంద్రం
Keep Reading
Add A Comment