తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. సైన్స్ సెంటర్ దగ్గర బైక్‌పై వెళ్లున్న టీటీడీ ఉద్యోగి విజయ్‌కుమార్‌కు నడి రోడ్డుపై చిరుత కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన ఆయన రోడ్డుపైన డివైడర్‌ను ఢీ కొట్టి ప్రమాదనికి గురయ్యారు. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చిరుత బారినపడిన వ్యక్తిని టీటీడీ ఉద్యోగి మునికుమార్ గా గుర్తించారు. అతడు బైక్ పై వెళుతుండగా చిరుత దాడి చేసినట్టు తెలిసింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతి శేషాచలం అడవులను ఆనుకుని ఉంటుందన్న సంగతి తెలిసిందే. తిరుపతి-తిరుమల కొండలపై వన్యప్రాణి సంచారం ఎక్కువగా ఉంటుంది. పలుసార్లు వన్య ప్రాణులు తిరుపతిలో జనావాసాల్లోకి వచ్చిన సంఘటనలు జరిగాయి.
Previous Articleకొండన్నకే ఎదురు చెప్తవా.. కీలక అధికారికి సీఎం సోదరుడి దమ్కీ
Next Article రేవంత్ కు పాలన చేతకాకనే బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడి
Keep Reading
Add A Comment