Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ అన్‌లిమిటెడ్ ఊటీ ట్రిప్! ప్యాకేజీ వివరాలివే!

హైదరాబాద్ నుంచి ఊటీ వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌‌సీటీసీ ‘అన్‌లిమిటెడ్ ఊటీ’ పేరుతో ఫ్లైట్ టూర్ అందుబాటులో ఉంచింది. ఈ ట్రిప్ జనవరి 25న మొదలవుతుంది.

ఐఆర్‌‌సీటీసీ అన్‌లిమిటెడ్ ఊటీ ట్రిప్! ప్యాకేజీ వివరాలివే!
X

వింటర్‌‌లో ఊటీ వెళ్లాలనుకునేవారికోసం ఐఆర్‌‌సీటీసీ ఓ ప్రత్యేకమైన టూర్‌‌ను ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌‌లో ఊటీతో పాటు కోయంబత్తూర్, కునూర్ వంటి ప్రదేశాలు కూడా చూడొచ్చు. ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నుంచి ఊటీ వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌‌సీటీసీ ‘అన్‌లిమిటెడ్ ఊటీ’ పేరుతో ఫ్లైట్ టూర్ అందుబాటులో ఉంచింది. ఈ ట్రిప్ జనవరి 25న మొదలవుతుంది. ఇందులో ఆదియోగి స్టాచ్యూతో పాటు, ఊటీ, కూనూర్‌‌లోని హిల్ స్టేషన్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

జనవరి 25 న ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌ టు కోయంబత్తూర్ ఫ్లైట్ ఎక్కడంతో టూర్ ప్రారంభమవుతుంది. ఫ్లైట్‌లో కొయంబత్తూర్ చేరుకున్న తర్వాత ఆదియోగి స్టాచ్యూకి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఊటీ బయల్దేరతారు. మొదటిరోజు రాత్రి ఊటీలో స్టే ఉంటుంది.

రెండో రోజు ఉదయాన్నే టిఫిన్ చేసి ఊటీలోని దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ వంటివి విజిట్ చేస్తారు. రెండో రోజు రాత్రి కూడా ఊటీలోనే స్టే ఉంటుంది. మూడో రోజు ఊటీకి దగ్గర్లోని పైకారా వాటర్ ఫాల్స్, షూటింగ్ పాయింట్స్, ముదుమలై నేషనల్ పార్క్ వంటివి విజిట్ చేసి రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు.

ఇక నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ ఉంటుంది. కూనూర్‌‌లోని సిమ్స్ పార్క్, ల్యాంబ్స్ రాక్ వంటివి విజిట్ చేసి సాయంత్రానికి కోయంబత్తూర్ బయల్దేరతారు. కోయంబత్తూర్‌‌లో సాయంత్రం 6.35 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఎక్కి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఆర్‌సీటీసీ అన్‌లిమిటెడ్ ఊటీ టూర్ ప్యాకేజీ ధరలు.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.24,850, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.25,450, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.32,600గా ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. టూర్ బుక్ చేసుకోడానికి ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్ (irctctourism.com) ను విజిట్ చేయొచ్చు.

First Published:  20 Jan 2024 10:57 AM GMT
Next Story