Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, May 19
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    భయపెడుతున్న వైరస్ ఎక్స్! లక్షణాలు ఎలా ఉంటాయంటే..

    By Raju AsariJanuary 20, 2024Updated:March 29, 20251 Min Read
    భయపెడుతున్న వైరస్ ఎక్స్! లక్షణాలు ఎలా ఉంటాయంటే..
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    కోవిడ్ తరహాలో మరో కొత్త వైరస్ మానవాళిని కబలించే అవకాశం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని వైరస్ ఎక్స్/ డిసీజ్ ఎక్స్ అంటున్నారు. ఇదెలా ఉంటుందంటే..

    ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ‘డిసీజ్ ఎక్స్’ అనేది కోవిడ్ కంటే పది రెట్లు ప్రమాదకరమైనది. ఇది అత్యంత వేగంగా సోకడమే కాకుండా ప్రాణాతకం కూడా. అందుకే డిసీజ్ ఎక్స్‌ను కోవిడ్, ఎబోలా, జికా వంటి ప్రమాదకరమైన మహమ్మారుల లిస్ట్‌లో చేర్చారు. దీనిపై ఇప్పటికే పరిశోధనలు మొదలయ్యాయి. వ్యాక్సిన్‌లు కూడా డెవలప్ చేస్తున్నారు.

    డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు వంటి పలు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి. దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక ఊహాజనిత వ్యాధి. దీనికారణంగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి. ఇదొక కొత్తరకమైన రోగకారక జీవి. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

    ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లుగతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, వాటిలో కొన్ని మనుషులపై తీవ్ర ప్రభావం చూపించొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. వీటికి సంబంధించి 25 వైరస్‌ కుటుంబాలను శాస్త్రవేత్తలు ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు. వాటిలో ఏదైనా వైరస్‌ మహమ్మారిగా రూపాంతరం చెందొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

    డిసీజ్ ఎక్స్‌లో జ్వరం, కండరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, కళ్ల వాపు, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కనుక వ్యాపిస్తే కోవిడ్‌ను మించిన ప్రమాదం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

    Disease X Pandemic
    Previous Articleఐఆర్‌‌సీటీసీ అన్‌లిమిటెడ్ ఊటీ ట్రిప్! ప్యాకేజీ వివరాలివే!
    Next Article సానియానే షోయబ్ కు విడాకులిచ్చిందా?
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.