Telugu Global
Telangana

కేసీఆర్ బర్త్‌డే రోజున స్వీట్లు పంచితే హెడ్‌మాస్ట‌ర్‌ను స‌స్పెండ్ చేస్తారా? : కేటీఆర్

కేసీఆర్ పుట్టిన రోజున మిఠాయిలు పంచి పెడితే.. హెడ్‌మాస్ట‌ర్‌ను స‌స్పెండ్ చేస్తారా..? అని కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ బర్త్‌డే రోజున స్వీట్లు పంచితే హెడ్‌మాస్ట‌ర్‌ను స‌స్పెండ్ చేస్తారా? : కేటీఆర్
X

తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన రోజున విద్యార్థులకు మిఠాయిలు పంచడం తప్పా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్ చేస్తే సరూనగర్‌ స్కూల్ ప్రధానోపాధ్యాయుడి సస్పెండ్ చేస్తారా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి రేవంత్ రెడ్డికి ఎందుకింత అభద్రతాభావంఅంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా నిలదీశారు. వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు..పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చు..ఆయన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచొచ్చు..అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయొచ్చని..ఆయనకు పాఠశాల విద్యార్థులను నడిఎండలో నిలబెట్టి పూలుచల్లి స్వాగతం పలకొచ్చని..వారితో ఆయనకు అధికార యంత్రాంగం దగ్గరుండి సెల్యూట్ కొట్టించవచ్చని ఏ అర్హత లేకున్నా అధికారిక వేదికపై కలెక్టర్ ను వెనక్కు నెట్టి వేదికను పంచుకోవచ్చంటూ ఆయా సంఘటనలను కేటీఆర్ ప్రస్తావించారు.

మంత్రి పొంగులేటి పుట్టినరోజున విద్యార్థులను ఎండలో నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయవచ్చని..డిప్యూటీ సీఎం సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణికి ఎస్కార్ట్ సదుపాయం కల్పించవచ్చని గుర్తు చేశారు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 14 ఏండ్లు అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ఆత్మగౌరవాన్నిఆత్మగౌరవాన్ని నిలబెట్టి, అస్థిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.

First Published:  18 Feb 2025 5:55 PM IST
Next Story