Telugu Global
Telangana

రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ భౌతిక దాడులు : ఎమ్మెల్సీ కవిత

భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించారు.

రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్  భౌతిక దాడులు : ఎమ్మెల్సీ కవిత
X

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌‌పై దాడిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఇది సీఎం రేవంత్ చేసిన దాడిగా కవిత ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏలోనే విద్వేషం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న రేవంత్ ప్రభుత్వాన్నికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యాలయంపై దాడులు చేసిన వారితో పాటు వారి వెనుక ఉన్న నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు..

బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామని ఆమె హెచ్చరించారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని కవిత డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గూండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు.

First Published:  11 Jan 2025 7:24 PM IST
Next Story