Telugu Global
Telangana

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై టీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు.

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై టీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. అల్లు అర్జున్‌పై మాకు ఎలాంటి కక్ష లేదని బన్నీ మామ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడేనని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు.‘‘సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.. ఆయన కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోతే కూడా అరెస్ట్ చేయొద్దా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే.. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావటానికి.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణమని పీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. దీంతో.. మరో సరికొత్త అంశం చర్చనీయాంశంగా మారింది.


First Published:  14 Dec 2024 6:45 PM IST
Next Story