జేఎన్టీయూ ఇంచార్జి వీసీగా తోపారపు గంగాధర్
జేఎన్‌టీయూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ ఇంచార్జి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ తోపారపు గంగాధర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
BY Vamshi Kotas7 Dec 2024 5:03 PM IST
X
Vamshi Kotas Updated On: 7 Dec 2024 5:03 PM IST
జేఎన్టీయూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయ ఇంచార్జి ఉపకులపతిగా ప్రొఫెసర్ తోపారపు గంగాధర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రతిష్టంచనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రొఫెసర్ తోపారపు గంగాధర్ రూపకర్త కావడం ఈ సందర్భంగా గమనార్హం. సచివాలయంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగనుంది. ఇంతలోనే గంగాధర్ ను ప్రభుత్వం జేఎన్టీయూ ఇంచార్జి వైస్ చాన్సలర్ గా నియమించి గౌరవించడం విశేషం.
Next Story