తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు : ఎమ్మెల్యే నాయిని
తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవచ్చు అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
BY Vamshi Kotas5 Feb 2025 10:26 AM IST
X
Vamshi Kotas Updated On: 5 Feb 2025 10:26 AM IST
తీన్మార్ మల్లన్నఇష్టం లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోవచ్చు అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతు తీన్మార్ మల్లన్నకు ఆయన కులం గురించి మాట్లాడే హక్కు ఉంది. ఇతర కులాలను తిట్టే హక్కు మాత్రం లేదన్నారు. ఆయనకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి బయటికెళ్లి మాట్లాడుకోవచ్చు. ఆనాడు మేము రెడ్లు అని గుర్తు లేదా? అని నిలదీశారు నాయిని రాజేందర్ రెడ్డి. ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన కుల గణన సర్వేను… తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తీన్మార్ మల్లన్న. ఆ కుల గణన రిపోర్టును మీడియా వేదికగా… కాల్చివేసి రచ్చ చేశారు తీన్మార్ మల్లన్న. దీంతో అతనిపై వేటువేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్…చేస్తున్నారు.
Next Story