తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో ముసురుతో చుట్టుకున్నది. కాగా నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మబ్బులు ఏర్పాడి వెదర్ కూల్‌గా మారింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నాది. ముఖ్యంగా ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. . డిసెంబర్ చివరి వారంలో ఇలా వర్షాలు పడటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
బుధవారం ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా టెంపరేటర్లు పడిపోయాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా నమోదయ్యాయి. రాత్రి టెంపరేచర్లు పెరిగాయి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో ఇది కొనసాగుతుందని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపారు.