Telugu Global
Telangana

సీఎం వదిలిపెట్టే ప్రసక్తే లేదు : బండి సంజయ్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు

సీఎం వదిలిపెట్టే ప్రసక్తే లేదు :  బండి సంజయ్
X

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రశక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చారించారు. హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నీకు సంక్రాంతి డెడ్ లైన్.. ఆ లోపు హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీదే అన్నారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ అన్నారు. తులం బంగారం, మహిళలకు రూ.2500, రూ.4వేల పెన్షన్, యువతకు స్కూటీలు ఏమయ్యాయ్ అని నిలదీశారు

అబద్ధాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికలు ఎప్పుడూ జరిగితే అప్పుడే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. అచ్చొచ్చిన ఆంబోతుల్లా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న దొంగలు కాంగ్రెసోల్లు అన్నారు. సంక్రాంతి తరువాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రోడ్ల మీద తిరగనియ్యమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీ చోటా ప్రశ్నిస్తామన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. రేవంత్ సర్కార్ ఏడాది పాలనలో అన్ని వర్గాలను మోసం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

First Published:  7 Dec 2024 9:06 PM IST
Next Story