రాష్ట్రంలో పెరిగిన బీర్ల ధరలు... ఏ బీరు ఎంత ధర పెరిగిందంటే?
తెలంగాణలో నేటి నుండే అమల్లోకి పెరిగిన బీర్ల ధరలు అమల్లోకి వచ్చాయి
BY Vamshi Kotas11 Feb 2025 8:41 PM IST
![రాష్ట్రంలో పెరిగిన బీర్ల ధరలు... ఏ బీరు ఎంత ధర పెరిగిందంటే? రాష్ట్రంలో పెరిగిన బీర్ల ధరలు... ఏ బీరు ఎంత ధర పెరిగిందంటే?](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402555-beers.webp)
X
Vamshi Kotas Updated On: 11 Feb 2025 8:41 PM IST
తెలంగాణ వ్యాప్తంగా బీర్ల రేటులను 15 శాతం పెంచుతూ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెంచిన ధరలు ఇవాళ నుండి అమలులోకి వస్తాయని ప్రకటించింది. బీర్ల ధరల పెరుగుదలతో సర్కార్‌కి రూ.700 కోట్లకు పైగా అదనపు రాబడి సమకూరుతుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
బీర్ల ధరలు పెరగడంతో తెలంగాణలో వివిధ బీర్ల ధరలు ఇలా ఉండనున్నాయి. లైట్ బీరు ఇప్పటి వరకు రూ.150 ఉండగా రూ.172కు పెరిగింది. కింగ్ ఫిషర్ ప్రీమియం రూ.160 నుండి రూ.184కు, బడ్వైజర్ లైట్ రూ.210 నుండి రూ.241.5కి, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ రూ.220 నుండి రూ.253కు, బడ్వైజర్ మ్యాగ్నం రూ.220 నుండి రూ.253, టుబోర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుండి రూ.276కు పెరిగాయి.
Next Story