Telugu Global
Telangana

వైటీపీఎస్‌ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం

రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీర్చడానికి కీలకమైన యాదాద్రి విద్యుత్‌ కేంద్రం రెండో యూనిట్‌

వైటీపీఎస్‌ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం
X

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీర్చడానికి కీలకమైన యాదాద్రి విద్యుత్‌ కేంద్రం రెండో యూనిట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. అనంతరం వైటీపీఎస్‌ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద కృష్ణా నదికి సమీపంలో ఒక్కోటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం ఐదు యూనిట్లను ఈ కేంద్రంలో నిర్మిస్తున్నారు.రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను సిద్ధం చేస్తున్నది. విద్యుత్‌ కొరత, కోతలను అధిగమించడంతో పాటు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ కేంద్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల గ్రామ శివారులో ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. అలాగే, ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి ముఖ్యమంత్రి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఇతర మంత్రులతో కలిసి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

First Published:  7 Dec 2024 5:26 PM IST
Next Story