Telugu Global
Telangana

ఫార్ములా ఈ రేస్‌పై చ‌ర్చ‌కు సీఎంకి దమ్ములేదు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

సీఎం రేవంత్ రెడ్డికి ద‌మ్ము లేక‌నే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్‌పై చ‌ర్చ‌కు ఒప్పుకోలేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద‌ అన్నారు

ఫార్ములా ఈ రేస్‌పై చ‌ర్చ‌కు సీఎంకి దమ్ములేదు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
X

ఫార్ములా ఈ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ము లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌పై చర్చ జరిగితే వాస్తవాలు బయట పడుతాయని భయంతో రేవంత్ రెడ్డి చ‌ర్చ‌కు ఒప్పుకోలేదు అని వివేకారంద అన్నారు. శాసన సభ ఆవరణలో మీడియా పాయింట్‌లో కేపీ వివేకానంద మాట్లాడారు. శాసన సభ సమావేశాలు ఓ పద్దతి లేకుండా నడుస్తున్నాయి. అసెంబ్లీ చరిత్రలోనే కొత్త సంప్రదాయాలకు రేవంత్ స‌ర్కార్‌ తెర లేపింది. రూల్స్‌కు వ్య‌తిరేకంగా సమావేశాలు నడుస్తున్నాయి. నియమాలు, నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారం సభను నడుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలే నడపలేకపోతున్నారు.. ఇక ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు..? ముఖ్యమంత్రి అనుభవరాహిత్యంతో సమస్యలు వస్తున్నాయి. సీఎం తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేపీ వివేకానంద పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీలు ,420 హామీల నుంచి దృష్టి మరల్చడానికే రేవంత్ మా నేత కేటీఆర్‌పై కేసు పెట్టారు. పన్నెండు నెలల్లో పన్నెండు విచారణలు చేశారు. రేవంత్ పాలన మీద దృష్టి పెట్టలేదు . ఫార్ములా ఈ రేసింగ్‌తో రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది. కుంభ కోణంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చర్చ కోసం పట్టుబడితే కాంగ్రెస్ సభ్యులు మా మీద దాడి చేశారు. చెప్పులు, బాటిళ్లతో మాపై దాడి చేశారు. ప్రతిపక్ష సభ్యులకు హక్కులుండవా? కొన్ని వీడియోలే కావాలని బయట పెట్టారు. సీఎం ప్రోద్బలంతోనే కాంగ్రెస్ సభ్యులు రెచ్చిపోతున్నారని ఆయన అన్నారు.

First Published:  20 Dec 2024 6:01 PM IST
Next Story