Telugu Global
Telangana

అసెంబ్లీ వద్ద ఉద్రిక్త.. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్

తెలంగాణ శాసన సభ సమావేశాల ప్రారంభానికి ముందు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అసెంబ్లీ వద్ద ఉద్రిక్త.. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
X

తెలంగాణ శాసన సభ సమావేశాల ప్రారంభానికి ముందు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదానీ, రేవంత్ దోస్తీపై నిరసన తెలిపిన బీఆర్ఎన్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అదానీ, రేవంత్ ఫోటోలను ముద్రించిన టీ షర్టుల ధరించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొదట కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కేటీఆర్ సహా అందరిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ గేట్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది .ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే ప్రారంభం అయ్యాయి.

First Published:  9 Dec 2024 11:25 AM IST
Next Story