Telugu Global
Telangana

తెలంగాణ ఆర్టీసీకి యాడ్స్ పేరుతో రూ.21 కోట్లకు టోకరా

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో'గో రూరల్ ఇండియా' అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా వేసినట్టు తెలుస్తోంది

తెలంగాణ ఆర్టీసీకి యాడ్స్ పేరుతో రూ.21 కోట్లకు  టోకరా
X

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో 'గో రూరల్ ఇండియా' అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా వేసినట్టు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ 'గో రూరల్ ఇండియా'కు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది. బస్సులపై ప్రకటనల ప్రదర్శనకు టీజీఎస్ఆర్టీసీతో 'గో రూరల్ ఇండియా' ఒప్పందం కుదుర్చుకుంది. కానీ యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వలేదని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా వివిధ అనుబంధ కంపెనీల ద్వారా వ్యాపారం నిర్వహంచినట్లు ఈడీ గుర్తించింది.

ప్రకటనల పేరుతో ఎంతోమంది కస్టమర్ల నుండి వచ్చిన డబ్బులను సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లుగా ఈడీ విచారణలో వెల్లడైంది. టీజీఎస్ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.21.72 కోట్ల బకాయిలను చెల్లించకుండా తమ అనుబంద సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు ఈడీ తేల్చింది.కస్టమర్ల నుంచి వచ్చిన కోట్లాది రూపాయలు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించారని ఈడీ దర్యాప్తులో తేలింది. తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.21.72 కోట్ల బకాయిని చెల్లించకుండా ఆ డబ్బును.. వివిధ పెట్టుబడులకు ఉపయోగించారని ఈడీ అధికారులు దర్యాప్తు తేల్చారు. ఈకేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ పేర్కొన్నాది

First Published:  14 Feb 2025 9:51 PM IST
Next Story