Telugu Global
Telangana

ఈనెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 30వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం కానుంది.

ఈనెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ
X

ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ స‌మావేశం కానుంది. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో రైతు భరోసా,కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే భూమిలేని పేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమిలేని, కూలి పనులు చేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకం గురించి ఈ మంత్రి వర్గం లో చర్చించనున్నారు.

అలాగే వచ్చే నెల సంక్రాంతి 14 వ తేదీ నుండి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. దీనిపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో 46 లక్షల కుటుంబాలకు ఎటువంటి వ్యవసాయ భూమి లేదు. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలి గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది.

First Published:  23 Dec 2024 9:03 PM IST
Next Story