టెట్ పరీక్షలో సాంకేతిక లోపం..అభ్యర్థుల ఆందోళన
టెట్ పరీక్షలో గందరగోళం ఏర్పడింది.
BY Vamshi Kotas11 Jan 2025 9:06 PM IST
X
Vamshi Kotas Updated On: 11 Jan 2025 9:06 PM IST
తెలంగాణలో నిర్వహిస్తోన్నలో టెట్ ఎగ్జమ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో సాయంత్రం 4 గంటలకు ముగియాల్సిన టెట్ ఎగ్జామ్ రాత్రి 7:30 గంటలు దాటినా కొనసాగింది. సెకండ్ సెషన్‌లో మధ్యాహ్నం 2గంటలకు మొత్తం 750 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 467 మంది హాజరయ్యారు. సర్వర్ డౌన్ కారణంగా 150 మంది అభ్యర్థులకు టెట్ పరీక్ష నిలిచిపోయింది. దీంతో పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు శంషాబాద్- షాబాద్ రహదారిపై ధర్నా చేశారు.వెంటనే అప్రమత్తమైన అధికారులు చాలాసేపు కష్టపడి.. సమస్యను సరిచేశారు. అనంతరం పరీక్షను మళ్లీ ప్రారంభించారు
Next Story