ఆ ఐదు కంపెనీలపై చర్యలు తీసుకోండి : ఎమ్మెల్యే కాటిపల్లి
ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలపై హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు
చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతోన్న పలు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కంప్లెంట్ చేశారు. హైడ్రా కార్యాలయంలో రంగనాథ్‌ను కలిసిన అనంతరం మీడియాతో కాటిపల్లి మాట్లాడారు. హైదారాబాద్‌లో ఐదు కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. రెండు నెలల క్రితమే చెరువుల కబ్జాపై తాను మాట్లాడినట్ల చెప్పారు. అయితే, తాను మాట్లాడిన 10 రోజుల తర్వాత.. అనుమతులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిపారు. సరిగా నేను మాట్లాడిన 10 రోజుల తర్వాత అనుమతులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రకటించారు.
వీటికి పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలేందుకు లేవు ? ఈ ఐదు కంపెనీల మీద హైడ్రా రంగనాథ్‌కు ఫిర్యాదు చేశాదీనిపై శాసన సభలో మాట్లాడతాన్నారు. తప్పు చేసిన మంత్రులు అధికారులు ఎవరైనా శిక్షకు అర్హులే. ఈ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవాలి.ఈ యాక్ట్‌తో కబ్జాల నివారణ వీలవుతుంది. దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టు పడతాం.ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకి వెళ్తాం. ల్యాండ్ గ్రాభింగ్ పై రిఫార్మ్స్ తీసుకురాకుంటే నాయకులను ప్రజలు తరిమి కొడతారు. రియల్ ఎస్టేట్ పడిపోతే నష్టం ఏమి లేదు’అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ 5 సంస్థల విషయంలో అక్రమంగా అనుమతులిచ్చిన అధికారులు, వాటికి అండగా ఉన్న ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలి. భూ ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం నూతనంగా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది’’ అని రమణారెడ్డి అన్నారు.