Telugu Global
Telangana

నిలకడగా శ్రీతేజ్‌ హెల్త్ ..పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి

అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించి శ్రీతేజ్‌ను బ్రతికించండి అని మంత్రి కోమటిరెడ్డి కిమ్స్‌ వైద్యులకు తెలిపారు.

నిలకడగా శ్రీతేజ్‌ హెల్త్ ..పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి
X

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు శ్రీతేజ్‌ హెల్త్ కండీషన్‌పై కిమ్స్‌ ఆస్పత్రి బులిటెన్‌ విడుదల చేసింది. వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీతేజ్‌ శ్వాస తీసుకుంటున్నట్లు పేర్కొంది. బాలుడికి అప్పుడప్పుడు జ్వరం వస్తోందని.. నిన్నటితో పోల్చితే ఇవాళ శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు కిమ్స్ వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నాది. సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో జరిగిన సమయంలో తొక్కిసలాటలో గాయపడ్డ రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీ తేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇన్ని రోజులు కోమాలో ఉన్న శ్రీ తేజ ప్రస్తుతం.. ఆక్సిజన్ అవసరం లేకుండానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు అని తెలిపారు.

ఆలాగే ఆహారాన్ని కూడా తీసుకోగలుగుతున్నాడు. కానీ శ్రీ తేజకు అప్పుడప్పుడు జ్వరం వస్తోంది అని వివరించారు. కానీ అతని నాడీ వ్యవస్థ స్థిరంగా పనిచేస్తోంది అని హెల్త్ బులిటెన్ లో వివరించారు. అయితే శ్రీ తేజ ఆసుపత్రి బిల్స్ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్‌ను కిమ్స్‌ ఆస్పత్రిలో మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి కిమ్స్ వైద్యులకు పలు సూచనలు చేశారు. శ్రీతేజ్ చికిత్సకు ఎంత ఖర్చు అయిన ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అవసరం అయితే అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించి శ్రీతేజ్‌ను బ్రతికించండి అని మంత్రి వైద్యులకు తెలిపారు.

First Published:  21 Dec 2024 6:18 PM IST
Next Story