Telugu Global
Telangana

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు
X

కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కులగణన ఫామ్‌కు నిప్పుపెట్టడంపై పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోసం తాము చాలా కష్టపడ్డామని, అందుకు బాధగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా? అనేది డిసైడ్ చేసుకోవాలి. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలని మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. మరోవైపు తీన్మార్‌ మల్లన్నకు ఇతర కులాలను తిట్టే హక్కు లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆయన పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం సరైంది పేర్కొన్నారు. ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చునన్నారు.

తీన్మార్‌ మల్లన్న గెలుపుకోసం తనతో పాటుగా తన కుటుంబం మొత్తం పని చేసిందని వెల్లడించారు. ఆనాడు తాము రెడ్డిలం అని ఆయనకు గుర్తు లేదా అని నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు.. కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. కొంతమంది ఎమ్మెల్యేలు కులగణన సర్వే బాలేదని చెప్పకుండా, పారదర్శకంగా ఉందని భజన చేస్తున్నారని టాక్. ఇది సమగ్ర కుల సర్వే కాదు.. అగ్రకుల సర్వే అని మల్లన్న అన్నరని తెలుస్తోంది.

First Published:  5 Feb 2025 3:16 PM IST
Next Story