హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘోర ప్రమాదం
హెచ్‌సీయూలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది
BY Vamshi Kotas27 Feb 2025 9:33 PM IST

X
Vamshi Kotas Updated On: 27 Feb 2025 9:33 PM IST
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్ప కూలిపోయింది. ఈ కూలిన భవనం కింద ఓ కార్మికుడు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. తక్షణమే స్పందించిన తోటి కార్మికులు, సిబ్బంది వారిని బయటికి లాగారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారెమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు హెచ్‌సీయూ అధికారులు తెలిపారు
Next Story