Telugu Global
Telangana

నల్లగొండ కలెక్టర్‌ త్రిపాఠి సంచలన నిర్ణయం

నల్గొండ జిల్లాల్లో పనిచేసే 99 మంది పంచాయతీ కార్యదర్శులకు సర్వీస్‌ బ్రేక్‌ చేస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు.

నల్లగొండ కలెక్టర్‌ త్రిపాఠి సంచలన నిర్ణయం
X

నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకుంది. 99 మంది పంచాయతీ కార్యదర్శుల గైర్హాజరు కాలానికి సర్వీస్‌ బ్రేక్‌ చేస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి పర్మిషన్ లేకుండా నెలల తరబడి విధులకు హాజరు కాకపోవడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పనిచేసే 99 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రెండు నెలల నుంచి 11 నెలల పాటు (ఒక్కొక్కరు ఒక్కో రకంగా) విధులకు గైర్హాజరయ్యారు. గత నెలలో వారంతా విధుల్లో చేరేందుకు కలెక్టర్‌ను సంప్రదించగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. గ్రూపు–1, గ్రూపు–2కు ప్రిపేర్‌ అయ్యేందుకు చాలా మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు కొన్ని నెలలుగా గైర్హాజరయ్యారు. వాస్తవానికి వారు ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకొని, సెలవు పెట్టాలి. కానీ, వారు సెలవు పెడుతున్నట్లు ఒక పేపరుపై రాసి కార్యాలయంలో ఇచ్చి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఆ 99మంది విధుల్లో చేరేందుకు వచ్చారు. గైర్హాజరు కాలానికి సర్వీస్‌ బ్రేక్‌ చేస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకొని వారు విధుల్లో చేరేందుకు ఉత్తర్వులు ఇస్తూ ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇచ్చారు. సర్వీస్‌ బ్రేక్‌ చేయడంతో భవిష్యత్‌లో రెగ్యులరైజేషన్‌, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల తదితర వాటిల్లో నష్టం జరిగే అవకాశం ఉంది. కలెక్టర్‌ నిర్ణయాన్ని పంచాయతీ కార్యదర్శులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిని నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయాలని కానీ మానవత్వంతో సర్వీస్ బ్రేక్ మాత్రమే చేశామని తిరిగి విధుల్లోకి తీసుకున్నామంటూ సర్వీస్ బ్రేక్ విషయంలో క్లారిటీ ఇచ్చిమని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు.

First Published:  17 Jan 2025 3:16 PM IST
Next Story