Telugu Global
Telangana

ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌లు సేవలు ప్రారంభం

దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల సేవలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి.

ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌లు సేవలు ప్రారంభం
X

సుదూర ప్రాంత ప్రయాణికుల కోసం టీజీటీడీ పికప్ వ్యాన్‌లను ఏర్పాటు చేసింది ఇవాళ నుంచే అమలులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ఈసీఐఎల్‌- ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్‌ వ్యాన్‌లను తీసుకొచ్చింది.

విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వెళ్లేవారి కోసం ఈ పికప్‌ వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. కాప్రా మున్సిపల్‌ కాంప్లెక్‌, మౌలాలీ హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్‌, హెచ్‌ఎంటీ నగర్‌, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌, నాగోల్‌, సుప్రజ ఆస్పత్రి, ఎల్బీనగర్‌ ఎల్‌పీటీ మార్కెట్‌ నుంచి పికప్‌ వ్యాన్‌లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ తెలిపింది. ముందస్తు టిక్కెట్‌ను బుక్ చేసుకొవాలని ఆర్టీసీ పేర్కొన్నాది.

First Published:  6 Dec 2024 9:13 PM IST
Next Story