హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 05 వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
BY Vamshi Kotas28 Jan 2025 8:05 PM IST

X
Vamshi Kotas Updated On: 28 Jan 2025 8:05 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఎస్ఐఆర్ ను కొట్టివేయాలంటూ హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో ఫిబ్రవరి 5 వరుకు ఆయనను అరెస్ట్ చేయుద్దని కోర్టు ఆదేశించింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి హరీశ్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో హరీశ్ రావుతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు.
Next Story