Telugu Global
Telangana

అడ్డగుట్ట కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస

సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో తీవ్ర రసాభాస నెలకొంది.

అడ్డగుట్ట కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస
X

సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో తీవ్ర రసాభాస నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మేమంటే మేము పంపిణీ చేస్తామని అనుకోవడంతో ఇరువురి మధ్య చెక్కుల పంపిణీ విషయంలో వాగ్వాదం నెలకొంది. పోటాపోటీ నినాదాల మధ్య ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ చెక్కులు పంపిణీ చేశారు.

కాంగ్రెస్ వాళ్లు చాతకాని దద్దమ్మలు.. హైదరాబాద్‌లో ఒక్క కార్పొరేటర్ గెలవరు, ఒక ఎమ్మెల్యే గెలవరు.. ఇలాంటి కాకి గోలలు చేస్తే మేము బెదరమని ఎమ్మెల్యే పద్మారావు అన్నారు. మా కార్యకర్తలు గుండె నిండా ధైర్యంతో ఉంటారు.. 20 ఏండ్లు ఉద్యమాలే చేసినవాళ్లు ఈ 4,5 ఏండ్లకి భయపడరని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గల్ల పట్టి బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిలదీస్తారని ఆయన అన్నారు

First Published:  6 Feb 2025 9:04 PM IST
Next Story